ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
విద్యార్థులు పరిశుభ్రతను అలవర్చుకోవాలని మున్సిపల్ కమిషనర్ పి.భవాని ప్రసాద్ సూచించారు. శుక్రవారం స్థానిక బాలికల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు శుభ్రత-పరిశుభ్రత అంశంపై వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉండటానికి చేతులను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, విద్యార్థినిలు పాల్గొన్నారు.










