విద్యార్థులు లేక బోసిపోయిన కెజిబివి
ప్రజాశక్తి మడకశిర : పాఠశాలలు పున: ప్రారంభించి మూడు రోజులు గడుస్తున్నా ఇంతవరకు విద్యార్థులు పూర్తిస్థాయిలో హాజరు కాకపోవడంతో ఆయా పాఠశాలలు వెలవెలబోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో కొంతవరకు విద్యార్థులు హాజరు అవుతున్నా హాస్టల్, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో విద్యార్థుల హాజరుశాతం తక్కువగా ఉంది. నియోజకవర్గ పరిధిలోని అమరాపురం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో మంగళవారం కేవలం ఐదుగురు విద్యార్థులు మాత్రమే హాజరు అయ్యారు. అయితే వారు కూడా పాఠశాల తరగతులు పూర్తి అయిన తర్వాత తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ఎండలు అధికంగా ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపడానికి జంకుతున్నట్లు తెలుస్తోంది.










