Sep 14,2023 22:01

ప్రజాశక్తి - ముసునూరు
            విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ కనబర్చాలని నూజివీడు నియోజకవర్గ వ్యాయామ ఉపాధ్యాయ సంఘం గౌరవ అధ్యక్షులు బి.సుకుమార్‌ అన్నారు. ముసునూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జెడ్‌పిటిసి సభ్యులు డాక్టర్‌ ప్రతాప్‌ చేతులమీదుగా బాలుర ఆటల పోటీలను గురువారం ప్రారంభించారు. అండర్‌-14లో ఖోఖో బాలుర జట్టుకు 14 మంది, అండర్‌-17 ఖోఖో బాలుర జట్టుకు 16 మంది, అండర్‌-17 బాల్‌బ్యాడ్మింటన్‌ బాలుర జట్టుకు 21 మంది, అండర్‌-14 బాల్‌ బ్యాడ్మింటన్‌ బాలుర జట్టుకు 16 మంది, అండర్‌-14 షెటిల్‌ బాలుర జట్టుకు ఐదుగురు, అండర్‌-17 షెటిల్‌ బాలుర జట్టుకు ఐదుగురు, అండర్‌-17 టెన్నికాయిట్‌ బాలుర జట్టుకు ఐదుగురు, అండర్‌-14 టెన్నికాయిట్‌ జట్టుకు ఐదుగురు, అండర్‌-14 వాలీబాల్‌ జట్టుకు17 మంది, అండర్‌-17 వాలీబాల్‌ జట్టుకు 17 మంది ఎంపికై జిల్లాస్థాయి ఆటల్లో పాల్గొంటారని వ్యాయామ ఉపాధ్యాయులు పి.రవీంధ్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచి కె.విజయలక్ష్మి, ఉపాధ్యాయులు వాకా నాగరాజు, ఆలీఖాన్‌, హేమ, సుగణరావు, నాగేశ్వరరావు, ప్రధానోపాధ్యాయులు వాణి, జి.నాగేశ్వరరావు పాల్గొన్నారు.