Sep 16,2023 21:59

మాట్లాడుతున్న జిల్లా విద్యాశాఖాధికారి వి.నాగరాజు

         ప్రజాశక్తి-అనంతపురం సిటీ   శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడంలో భాగంగా విద్యార్థులతో సైన్స్‌ ప్రయోగాలను చేయించాలని జిల్లా విద్యాశాఖ అధికారి వి.నాగరాజు సూచించారు. శనివారం స్థానిక సైన్స్‌ సెంటర్‌లో ఉన్నత పాఠశాలల్లోని సైన్స్‌ ఉపాధ్యాయులకు డివిజన్‌ వారీ నేషనల్‌ సైన్స్‌ కాంగ్రెస్‌పై ఒకరోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైన్స్‌ ఉపధ్యాయులకు ఇన్‌ స్పైయర్‌ మ్యాన్క్‌ నామినేషన్ల ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు ఐఎఫ్‌పి ప్యానల్‌తో పాఠాలు బోధించటంలో నైపుణ్యం సాధించాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులతో సైన్స్‌ ప్రదర్శనలకు ఉత్తమమైన ప్రాజెక్టులు తయారు చేయించాలన్నారు. జిల్లా సైన్స్‌ సెంటర్‌ అధికారి బాలమురళీకృష్ణ సైన్స్‌ కార్యక్రమాల్లో జిల్లాను ముందంజలో ఉంచేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రీసోర్స్‌ ఉపాధ్యాయులు మేడా ప్రసాద్‌, శామ్యూల్‌ ప్రసాద్‌, ఆనంద, భాస్కర్‌రెడ్డి, రాము, తదితరులు పాల్గొన్నారు.