Sep 19,2023 20:12

ప్రజాశక్తి - ఉంగుటూరు
   నారాయణపురం జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో మంగళవారం దాతల సహకారంతో విద్యార్థులకు ఆర్‌టిసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు వీలుగా బస్‌పాస్‌లు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన దాత బళ్ల త్రిమూర్తులు ఆర్థిక సాయంతో తాడేపల్లిగూడెం ఆర్‌టిసి డిపో అధికారులు 300 మంది విద్యార్థులకు సిద్ధం చేసిన ఈ పాస్‌లను అందివ్వడం అభినందనీయమని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఎల్‌ఎ పుప్పాల వాసుబాబు అన్నారు. విద్యార్థులు వారు కోరుకున్న రూట్‌ నుంచి 20 కిమీ పరిధిలో ఎక్కడికైనా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని డిపో మేనేజర్‌ వైఎస్‌ఎన్‌.మూర్తి తెలిపారు. అనంతరం దాత త్రిమూర్తులను ఎంఎల్‌ఎ శాలువతో సన్మానించి, జ్ఞాపిక అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి, జడ్‌పిటిసి సభ్యురాలు కొరిపల్లి జయలక్ష్మి, వైసిపి మండల కన్వీనర్‌ మరడ మంగారావు, ఆర్‌టిసి పిఆర్‌ఒ దొంతల విజయకుమార్‌, ఇఒపిఆర్‌డిఒ షంషుద్ధీన్‌, వైసిపి జిల్లా కార్యదర్శి పుప్పాల గోపి, పంచాయతీ కార్యదర్శి జె.నాగేశ్వరరావు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.