ఉంగుటూరు:మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్థానిక ఎంపిటిసి సభ్యుడు డాక్టర్ పెనుగొండ బాలకృష్ణ ఇచ్చిన ఆర్థిక సాయంతో తాడేపల్లిగూడెం ఆర్‌టిసి డిపో అధికారులు 160 మందికి బస్ పాసులను సిద్ధంచేసి వాటిని ఎంఎల్‌ఎ వాసుబాబు సమక్షంలో శనివారం అందజేశారు. డిపోమేనేజర్ మూర్తి, ఎంపిపి గంటా శ్రీలక్ష్మి, జెడ్‌పిటిసి సభ్యురాలు కొరిపల్లి జయలక్ష్మి, ఎంపిటిసి సభ్యుడు సందక రాంబాబు, మంద జయలక్ష్మి, పుప్పాల గోపి తదితరులు పాల్గొన్నారు. బస్సు పాసులకు ఆర్థికసాయం ఇచ్చిన బాలకృష్ణను డిపో అధికారులు సత్కరించారు.










