విద్యార్థులకు సన్మానం
ప్రజాశక్తి - చాగలమర్రి
చాగలమర్రి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల లో పదవ తరగతిలో అత్యంత ప్రతిభ కనబరచిన విద్యార్థులకు సన్మానం చేసారు.శనివారం స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల లో హెచ్ఎం కోటయ్య అధ్యక్షతన అభినందన సభ ఏర్పాటు చేసారు.ఈ సందర్భంగా పదవ తరగతి ఇంగ్లీషు మాధ్యమంలో అత్యంత ప్రతిభ కనబరచి మొదటి ఐదు స్థానాలలో నిలిచిన పీటర్(551)కు 10 వేల రూపాయలు,అబ్ధుల్ రహమాన్(514)కు రూ 6వేలు,అబ్జల్(513)కు రూ 4 వేలు,వైష్ణవి (512)కి రూ2 వేలు,గణపతి రెడ్డి(502)కు రూ2 వేలు,తెలుగు మాధ్యమంలో అత్యధిక మార్కులు సాధించిన చరితారెడ్డికి (485) రూ2,500 లు దాతలు కాసా మహేశ్వరరెడ్డి కుమార్తె మహతి జ్ఞాపకార్థం తరపున చంద్రశేఖర్ రెడ్డి,చక్రం బీడి,రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త షబ్బీర్ అహమ్మద్ తరపున నగదును వైస్ ఎంపిపి రఫి నగదును ,జ్ఞాపికలు,మెడల్స్‌ను దాత వైసిపి మైనార్టి సెల్ రాష్ట్ర కార్యదర్శి బాబులాల్ తరపున ఆయన కుమారుడు ఉప సర్పంచ్ సోహెల్,ప్రోత్సాహక బహుమతులను గేట్ల మాబు లు అందజేసి ఘనంగా సన్మానించారు.కార్యక్రమం లో ఎంఈఓ అనురాధ,విద్యా కమిటీ చైర్మన్ అబ్దుల్లా,వార్డు సభ్యులు బ్రాందిన్,మన్సూర్,షరీఫ్,వైసిపి నాయకులు ముల్లా ఖాదర్ భాష,బబ్లూ,ఖధీర్,ఉపాధ్యాయులు,విద్యార్థులు,వారి తల్లిదండ్రులు,తదితరులు పాల్గొన్నారు.










