Oct 20,2023 22:59

విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం

విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం
ప్రజాశక్తి - గూడూరు టౌన్‌ : గూడూరు పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిరం పాఠశాలలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా స్వామి ప్రణవాత్మానంద సరస్వ తీ పాల్గొన్నారు. పాఠశాలలో గణపతి హోమం, పూజ నిర్వహించారు. విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా అక్షరాభ్యాసం చేయించి ఆశీర్వదించారు. అనంతరం ప్రణవాత్మానంద సరస్వతీ మాట్లాడుతూ అక్షరాభ్యాసం విశిష్టతను, అక్షరాభ్యాసానికి వచ్చిన తల్లిదండ్రులకు కుటుంబం బాధ్యత ఎలా నిర్వ హించాలో తల్లి బాధ్యతను మార్గ నిర్దేశం చేశారు. అనంతరం విద్యార్థులకు పలకలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు మల్లెమాల మురళి రెడ్డి మురళీకష్ణ , రావూరు రవి చంద్రారెడ్డి, చల్లా చంద్రశేఖర్‌ రెడ్డి, నరసింహస్వామి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ అధ్యక్షులు మల్లెమాల మురళి రెడ్డి, ఉపాధ్యక్షులు ఆర్‌విరావు , కార్యదర్శి మురళి కష్ణ, సహకార్యదర్శి ప్రసాద్‌, కోశాధికారి రామ్మోహన్‌ పాఠశాల సహకార్యదర్శి మయూరి శ్యామ్‌ యాదవ్‌, సభ్యులు రవి చంద్రారెడ్డి, సనత్‌ రెడ్డి , లలిత, దయాకర్‌ పాల్గొన్నారు.