Jun 26,2023 22:05

ఆందోళన చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాగార్జున, బాబావలి మాట్లాడుతూ ఇంటర్‌ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించాలని ఖాళీగా ఉన్న లెక్చలర్‌ పోస్టులను భర్తీ చేయాలని పెండింగ్‌ లో ఉన్న నాడు నేడు పనులను త్వరగతిన పూర్తి చేసి పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. జగనన్న విద్యా కానుక కిట్లను ప్రతి విద్యార్థికి అందించాలన్నారు. సాంఘిక సంక్షేమహాస్టళ్లలో విద్యార్థులకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని బుక్కపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పక్కా భవనలు నిర్మించాలని జిల్లా కేంద్రంలోని పుట్టపర్తిలో ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు బాబ్జాన్‌, సహాయ కార్యదర్శి పవన్‌, హర్ష కుమార్‌, దాము, నిరంజన్‌, జయచంద్ర తదితరులు పాల్గొన్నారు.