Oct 07,2023 21:22

గుమ్మలకీëపురంలో సైకిల్‌యాత్రకు స్వాగతం పలుకుతున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం, భామిని : విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన చేపట్టిన సైకిల్‌ యాత్ర ఆరోరోజు శనివారం భామిని, గుమ్మలకీëపురం మండలాల్లో సాగింది. భామిని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులతో మెయిన్‌ రోడ్డు మీదుగా అంబేద్కర్‌ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. గుమ్మలకీëపురం మండలంలోని భద్రగిరి గిరిజన గురుకుల బాలుర పాఠశాల, పిటిజిని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మాట్లాడుతూ భామినిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. సంక్షేమ హాస్టళ్లకు బకాయలు, నిలిచిన మెస్‌ బిల్లులు వెంటనే విడుదల చేయాలన్నారు. పెరిగిన ధరలకు అనుకూలంగా మెస్‌ బిల్లులు పెంచాలని, ఉపాధ్యాయులపై యాప్‌ భారం తొలగించాలని డిమాండ్‌చేశారు. జిఒ నంబర్‌ 117 రద్దు చేయాలని, పాఠశాలల విలీనం ఆపాలని కోరారు. ఖాళీగా ఉన్న అధ్యాపక ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేయాలన్నారు. పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని, వసతిగృహాల్లో ఎఎన్‌ఎం పోస్టులు నియమించాలని డిమాండ్‌ చేశారు. సైకిల్‌యాత్రకు భామినిలో గిరిజన సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు కె.ప్రసాద్‌, కె.భాస్కరరావు స్వాగతం పలికారు. గుమ్మలకీëపురంలో ఎంపిటిసి రమణ, సిపిఎం నాయకులు శంకర్రావు సంఘీభావం తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.పండు, పి.రాజశేఖర్‌, నాయకులు ఎ.గంగారావు, కె.రాజు, హెచ్‌.సింహాచలం, కె. భాస్కరరావు, గౌతమ్‌, అఖిల్‌, ఉమాశంకర్‌, సిసింద్రీ, అన్నాజీ, వెంకీ తదితరులు పాల్గొన్నారు.