ప్రజాశక్తి మడకశిర : రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే తిప్పేస్వామి తెలిపారు. పట్టణంలోని జూనియర్ కళాశాల ఆవరణంలో గురువారం జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమాన్ని మండల విద్యాధికారి శ్రీనివాస భాస్కర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి, మున్సిపల్ వైస్ చైర్మన్ రామచంద్రా రెడ్డి, ఎంపీపీ కవితా సత్యనారాయణ, కౌన్సిలర్ సుభద్రా నాగేంద్ర, సింగల్ విండో అధ్యక్షుడు రామిరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యాభివృద్దికి జగన్ కట్టుబడి ఉన్నారన్నారు. మంచి చదువులు చదవాలనే ఉద్దేశంతో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మెమొంటో శాలువతో సత్కరించి నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారులు గోపాల్, సత్యనారాయణ, శ్రీధర్, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు హాజరయ్యారు.
కదిరి టౌన్ : కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా జగనన్న ఆణిముత్యాలనకు ఎంపికైన విద్యార్థులకు కదిరి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి బహుమతులను గురువారం అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చొరవతో ప్రతి ఏడాది ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాలు కింద ప్రోత్సాహకం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, విద్యాశాఖ అధికారులు, వైస్ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలతో పాటు పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
హిందూపురం : పేద విద్యార్థులందరూ ఉన్న స్థితి నుంచి ఉన్నతస్థాయి చేరుకోవాలన్నదే సీఎం జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ అన్నారు. స్థానిక అజిజీయా ఉన్నతపాఠశాలలో గురువారం హిందూపురం నియోజకవర్గం వ్యాప్తంగా పదవ తరగతి, ఇంటర్ పరీక్షల్లో ప్రతిభకనపర్చిన విద్యార్థులకు అణిముత్యాలు పురస్కారాల అవార్డు ప్రదానోత్సవం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ మాట్లాడుతూ విద్యతోనే పురోగతి అభివద్ధి సాధ్యమౌతుందని అన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ ఇంద్రజ, మాజీ సమన్వయకర్త కొండూరువేణుగోపాల్ రెడ్డి, ఎంపీడీవో నరేంద్ర, ఎంఈవో గంగప్ప, నాగరాజు, కెజిబివి విద్యాలయం ప్రిన్సిపల్ నీలిమా, ఎంజెపి ప్రిన్సిపల్ మురళీమోహన్, కౌన్సిలర్లు రోషన్ అలీ, నాసిరాబాను, హెచ్‌ఎం రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు.










