విద్యాభివృద్ధికి జగనన్న కృషి
ప్రజాశక్తి - పగిడ్యాల
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని లక్ష్మాపురం సర్పంచ్ సిరిగిరి సుజాత అన్నారు. బుధవారం మండలంలోని లక్ష్మాపురం అంచ సమీపాన ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఆణిముత్యాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సర్పంచ్ సుజాత మాట్లాడారు. ముఖ్యమంత్రి జగనన్న విద్య, వైద్యానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారని ఆమె అన్నారు. విద్యాభివృద్ధి కోసం జగనన్న విద్యా దీవెన, జగన్ అన్న వసతి దీవెన పథకాలను ప్రవేశపెట్టి ఉచితంగా పాఠ్యపుస్తకాలను నోటుబుక్కులను, బ్యాగులు యూనిఫామ్ అందచేస్తున్నారు. అమ్మ ఒడి పథకం కింద చదువుకున్న విద్యార్థి తల్లి ఖాతాలో రూ 15వెలు జమ చేయడం జరుగుతుందన్నారు. జగనన్న నాడు నేడు పథకం కింద పాఠశాలల అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ప్రిన్సిపాల్ వెంకటరమణమ్మ మాట్లాడుతూ. ఆణిముత్యాలలో భాగంగా పదవ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థినులకు నగదు ప్రోత్సాహ బహుమతులు అందించడం జరిగిందన్నారు. పదవ తరగతిలో సాధించిన మార్కులు లక్ష్మి 537 మార్కులు సాధించినందుకు మొదటి బహుమతి రూ 3వేలు, అనిత 533 మార్కులు సాధించినందుకు రెండవ బహుమతి రూ 2 వేలు, మధులత 529 మార్కులు సాధించినందుకు మూడో బహుమతి రూ 1వెయ్యి సర్పంచ్ సిరిగిరి సుజాత చేతుల మీదగా అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద వెంకట్, పాఠశాల సిబ్బంది, విద్యార్థినిల తల్లిదండ్రులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.










