ప్రజాశక్తి-అనంతపురం విద్య ద్వారానే సమాజంలో పేదరిక నిర్మూలన సాధ్యమని జెఎన్‌టియు ఇంజినీరింగ్ కళాశాల ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఇంజినీరింగ్ సీనియర్ ప్రొఫెసర్ పి.రమణారెడ్డి సూచించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక జెఎన్‌టియు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఇంజినీరింగ్ విభాగం 3వ సంవత్సరం విద్యార్థులు సెమినార్ హాల్‌లో సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కోసి పంచిపెట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యారంగంతోపాటు రాష్ట్రపతిగా అనేక సేవలు అందించారన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నేటి విద్యార్థులు, అధ్యాపకులు పని చేయాలని పిలుపునిచ్చారు. అప్పుడు మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. ఈకార్యక్రమంలో బోధనా సిబ్బంది బి.విష్ణువర్ధన్‌రెడ్డి, జి.మమత, డి.లలితకుమారి, విద్యార్థులు, బోదనేతర సిబ్బంది పాల్గొన్నారు.










