మాట్లాడుతున్న ఐటిడిఎ పిఒ కల్పనకుమారి
ప్రజాశక్తి-సీతంపేట : బోగస్ ఎస్‌టి కుల ధ్రువీకరణ పత్రాలపై విచారణను వేగవంతం చేస్తామని ఐటిడిఎ పిఒ కల్పనకుమారి తెలిపారు. శనివారం బోగస్ ఎస్‌టి కుల ధ్రువీకరణ పత్రాలపై వచ్చిన ఫిర్యాదులపై డిఎల్‌ఎస్‌సి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిర్యాదులు ఎదుర్కొంటున్న వారి కుల ధ్రువీకరణ పత్రాలు, విద్యార్హత ధ్రువపత్రాలను పరిశీలించారు. ఫిర్యాదు చేసిన వారి వద్ద ఉన్న ధ్రువపత్రాలను కూడా పరిశీలించారు. 3 కేసులకు సంబంధించి శనివారం విచారణ చేపట్టారు. మరిన్ని ఆధారాలు తీసుకురావాలని ఇరువురికి సూచించారు. కార్యక్రమంలో ఎపిఒ రోసిరెడ్డి, డిడి శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ దేశ్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










