Aug 08,2023 16:43

మాట్లాడుతున్న అంగన్వాడి యూనియన్ జిల్లా కార్యదర్శ ఎం. నిర్మలమ్మ

విఆర్ఏలను రెగ్యులర్ చేయాలి
వారికి వీఆర్వోలుగా ప్రమోషన్లు ఇవ్వాలి - సీఐటీయూ
ప్రజాశక్తి - నంద్యాల

    వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారికి వీఆర్వోలుగా ప్రమోషన్లు ఇవ్వాలని ఎపి గ్రామరెవెన్యూ  సహయాకుల సంఘం  రాష్ట్ర కమిటీ పిలుపులో బాగంగా నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టిన నిరాహార దీక్షలు మంగళవారం నాటికి రెండవ రోజుకు చేరుకున్నాయి.నిరాహార దీక్షలను ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్  సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం, నిర్మలమ్మ  ప్రారంభించారు. ఈ నిరాహార దీక్షలకు వి ఆర్ ఏ ల సంఘం జిల్లా అధ్యక్షులు నాగేష్, భూపాల్ అధ్యక్ష తనజరిగిన నిరాహార దీక్షలకు  ముఖ్య అతిథులుగా సీఐటీయూ జల్లా ప్రధాన కార్యదర్శి ఏ . నాగరాజు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి వీ, బాల వెంకట్ ఏపీ అంగన్వాడి యూనియన్ జిల్లా కార్యదర్శ ఎం. నిర్మలమ్మ లు పాల్గొని మాట్లాడుతూ వీఆర్ఏల కు పే స్కేల్ అమలు చేయాలని నామినేలుగా పనిచేస్తున్న వారందని వి ఆర్ ఒ లుగా నియమించాలని అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలని అధికారుల రాజకీయ వేధింపులు ఆపాలని అక్రమ తొలగింపులు చేయరాదని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు చేస్తున్న పోరాటానికి సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ భవిష్యత్ జరగబోయే ప్రత్యక్ష ఆందోళనకు సిఐటియు ముందుండి పోరాటం నిర్వహిస్తామని అన్నారు.అందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు హెచ్చరించారు. ఈ రెండవ రోజు నిరాహార దీక్షలకు ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా నాయకులు శ్రీనివాసులు, మహేష్, సలాం, అబ్దుల్, గఫూర్, భాష,మలీ,  రమణల నాయకత్వంలో జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుండి 200 మంది వీఆర్ఏలు పాల్గొన్నారు. ఈ నిరాహార దీక్షలకు ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రాజశేఖర్, సహాయ కార్యదర్శి టి రామచంద్రుడు  పాల్గొని మాట్లాడుతూ వీఆర్ఏలు చేస్తున్న న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.