విఆర్‌ఎల సమస్యలు పరిష్కరించాలి
- సిఐటియు జిల్లా అధ్యక్షులు యేసురత్నం
- జిల్లా వ్యాప్తంగా తహశీల్దార్ కార్యాలయాల ఎదుట రిలే దీక్షలు
ప్రజాశక్తి - ఆత్మకూరు
విఆర్‌ఏలకు పేస్కేలు అమలు చేయాలని, నామినీలుగా పని చేస్తున్న వారందరినీ విఆర్‌ఏలుగా నియమించాలని, డిఏతో కూడిన వేతనం అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు యేసురత్నం, పట్టణ కార్యదర్శి రామ్ నాయక్, ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా కార్యదర్శి భూపాల్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని విఆర్‌ఎల సంఘం ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎన్నికల ముందు ప్రత్యక్ష నేతగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదన్నారు. నాలుగు సంవత్సరాలుగా అనేకసార్లు విన్న వించినా ఫలితం శూన్యమన్నారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక విఆర్‌ఏలకు ఒక రూపాయి పెంచకపోగా ఉన్న డిఎల్లోను కోత విధించిం దన్నారు. విఆర్‌ఏల నామినిలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారిని విఆర్వోలుగా, అటెండర్లుగా, వాచ్ మెన్‌లుగా ప్రమోషన్లు కల్పించాలని కోరారు. డిఎతో కూడిన వేతనాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఇస్మాయిల్, వీఆర్‌ఏలు ముర్తుజా, శ్రీనివాసులు, వలి, లింగస్వామి, రవి, మనోహర్, అత్తర్, నాగమయ్య, భాగ్యమ్మ, మధు, తదితరులు పాల్గొన్నారు. బేతంచెర్ల : అర్హత గల విఆర్‌ఏలను అటెండర్ వాచ్మెన్ పోస్టులకు ప్రమోట్ చేయాలని వీఆర్‌ఏ సంఘం జిల్లా అధ్యక్షులు నందిపల్లి నాగేష్, సిఐటియు జిల్లా నాయకులు వై ఎల్లయ్య డిమాండ్ చేశారు. తాసిల్దార్ కార్యాలయాల ముందు విఆర్‌ఏల సంఘం మండల నాయకులు పుల్లయ్య శ్రీనివాసులు ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. వీఆర్‌ఏలు మనోహర్, చిన్నన్న, పుల్లయ్య, నాగలక్ష్మి, శివలక్ష్మి ,మద్దమ్మ, రాముడు ,మద్దిలేటి స్వామి, బాలయ్య, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ప్యాపిలి : ఎమ్మార్వో కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలో కూర్చున్న గ్రామ రెవెన్యూ సహాయకులకు ఎలక్ట్రిషన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, ఇలియాజ్, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు చెన్నయ్య, లక్ష్మన్న, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. సిఐటియు ప్యాపిలి మండల ప్రధాన కార్యదర్శి ఎస్.ఏ. చిన్న రెహమాన్, అధ్యక్షులు పోదొడ్డి శ్రీనివాసులు, డిప్యూటీ కార్యదర్శి పద్మశాలి శ్రీనివాసులు మాట్లాడుతూ వీఆర్‌ఏలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విఆర్‌ఎల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఓబులేసు, రామనాయుడు, కంబగిరి స్వామి, లింగమయ్య, సుంకన్న, కంబగిరి రాముడు, కిట్టు, నబి రసూల్, ప్రతాప్ పాల్గొన్నారు. నందికొట్కూరు టౌన్ : స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు విఆర్‌ఎలు రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే.భాస్కర్ రెడ్డి మాట్లాడారు. విఆర్‌ఎల గౌరవాధ్యక్షులు పుల్లయ్య, అధ్యక్షులు మహేశ్వర, ఉపాధ్యక్షులు సుధాకర్, కార్యదర్శి శివన్న, సహాయ కార్యదర్శి సవరయ్య, కోశాధికారి రంగస్వామి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పాల్గొన్నారు. బనగానపల్లె : విఆర్‌ఎలకు పే స్కేల్ అమలు చేయాలని సిఐటియు డివిజన్ అధ్యక్షులు జెవి.సుబ్బయ్య, గ్రామ సేవకుల సంఘం మండల అధ్యక్షుడు బాలుడు డిమాండ్ చేశారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు విఆర్‌ఎల సమస్యలను పరిష్కరించాలని గ్రామ సేవకుల సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. నాయకులు నాయుడు, ప్రసాద్, సుబ్రహ్మణ్యం, వెంకటలక్ష్మమ్మ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న సిఐటియు జిల్లా అధ్యక్షుడు వి.యేసురత్నం










