Jul 20,2023 20:53

కోసిగిలో దీక్షలను ప్రారంభిస్తున్న విజరుకుమార్‌

ప్రజాశక్తి - కోసిగి
విఆర్‌ఎల సమస్యలను పరిష్కరించాలని సంఘం జిల్లా అధ్యక్షులు అంజి డిమాండ్‌ చేశారు. గురువారం విఆర్‌ఎల సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో కోసిగిలోని వైఎస్‌ఆర్‌ సర్కిల్‌లో దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను కెవిపిఎస్‌ డివిజన్‌ మాజీ అధ్యక్షులు విజరు కుమార్‌ పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విఆర్‌ఎల సంఘం జిల్లా అధ్యక్షులు అంజి, సిఐటియు మండల కార్యదర్శి రాముడు మాట్లాడారు. విఆర్‌ఎలకు పేస్కేల్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. విఆర్‌ఎలు రూ.10,500 గౌరవ వేతనంతో పని చేస్తున్నారని, జీతం సరిపోక అనేక ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విఆర్‌ఎలను రెగ్యులరైజ్‌ చేస్తామని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఇచ్చిన హామీ అమలు కాలేదన్నారు. సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విఆర్‌ఎల సంఘం జిల్లా నాయకులు ప్రహ్లాద్‌, సిఐటియు మండల ఉపాధ్యక్షులు వీరేష్‌, విఆర్‌ఎల సంఘం డివిజన్‌ అధ్యక్షులు రాజు, మండల నాయకులు శాంతి రాజు, తిక్కయ్య, గురుస్వామి, నాగరాజు, లక్ష్మన్న, ఈరమ్మ, మహాదేవి, చిన్న ఈరమ్మ, నాగేష్‌, పురుషోత్తం, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రాజు పాల్గొన్నారు. హాలహర్వి బస్‌స్టేషన్‌ ఆవరణలో విఆర్‌ఎలు నిరాహార దీక్ష చేపట్టారు. ఎపి గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం (సిఐటియు) ఆధ్వర్యలో నిరహార దీక్షలను ప్రారంభించారు. రోడ్డు పక్కన బైఠాయించి ఆందోళన చేపట్టారు. విఆర్‌ఎల సంఘం మండల కార్యదర్శి తిమప్ప మాట్లాడారు. గోనెగండ్ల మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్షను ప్రారంభించారు. గోనెగండ్ల తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట శిబిరం ఏర్పాటు చేసి మొదటి రోజు దీక్షలో కూర్చున్నారు. విఆర్‌ఎలు రంగన్న, రామాంజనేయులు, హనుమంతు, పెద్ద బజారి, మోహన్‌, లక్ష్మీ, దస్తగిరి, టి.రంగన్న పాల్గొన్నారు. ఆలూరు తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట విఆర్‌ఎలు నిరసన దీక్ష చేపట్టారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కెపి.నారాయణ స్వామి మద్దతు తెలిపి మాట్లాడారు. విఆర్‌ఎల సంఘం డివిజన్‌ కార్యదర్శి అశోక్‌, మండల అధ్యక్ష, కార్యదర్శులు కోటప్ప, చెన్నప్ప, తిమ్మన్న, కుమార్‌, నాగరాజు, వీరేష్‌ పాల్గొన్నారు. హోళగుందలో విఆర్‌ఎలు దీక్షలు చేపట్టారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌కు వినతిపత్రం అందజేశారు. సిపిఎం మండల కార్యదర్శి లింగంపల్లి వెంకటేశ్వర్లు, సిఐటియు మండల నాయకులు నాగరాజు విఆర్‌ఎలకు సంఘీభావం తెలిపారు. మంత్రి గుమ్మనూరు జయరామ్‌ విఆర్‌ఎల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. విఆర్‌ఎల సంఘం మండల అధ్యక్షులు మల్లయ్య, ఆదోని డివిజన్‌ అధ్యక్షులు సిద్ధి లింగప్ప, డివిజన్‌ ఉపాధ్యక్షులు మౌలాలి పాల్గొన్నారు.

హోళగుందలో మంత్రికి వినతిపత్రం అందజేస్తున్న నాయకులు
హోళగుందలో మంత్రికి వినతిపత్రం అందజేస్తున్న నాయకులు