Sep 21,2023 19:15

వినతిపత్రం సమర్పిస్తున్న దృశ్యం

వినతిపత్రం సమర్పిస్తున్న దృశ్యం
వేతనాలు చెల్లించకపోతే విధులు బహిష్కరిస్తాం
ప్రజాశక్తి-ఉదయగిరి:పంచాయతీ కార్మికులకు రావాల్సిన ఏడు, 12 నెలల వేతనాలు చెల్లించకపోతే సమ్మె బాట పడతామని సిఐటియు జిల్లా నాయకులు గడ్డం నాగేశ్వరరావుతో కావలి డివిజనల్‌ అధికారిని రాధా మాధవి లతకు వినతి పత్రంను పంచాయతీ కార్మికులు అందజేశారు. గురువారం స్థానిక సచివాలయం బిట్‌ -1 సందర్శనకు వచ్చిన ఆమెకు పంచాయతీ కార్మికులు సమస్యల వినతిపత్రం అందజేశారు.
ఈ పనిచేయుచున్న పారిశుద్ధ్య సిబ్బందికి 7 నెలల జీతాలు, పి.డబ్ల్యుఎస్‌ పంపు ఆపరేటర్లకు గ్రామపంచాయతీ సిబ్బందికి 12 నెలల వేతనాలు చెల్లించాలన్నారు. కార్యదర్శిని రావలసిన వేతనాలు అడుగగా వారు 15వ ఆర్థిక సంఘం నిధులలో జీతములు చెల్లిస్తామని తెలిపారని నేటికి చెల్లించియుండలే లేదని వాపోయారు. 7 నుంచి 12 నెలల వేతనాలు రానందున మా కుటుంబ పోషణ ఇబ్బందికరంగా ఉన్నదున నిత్యావసర సరుకులు తెచ్చుకునే షాపులలో అప్పులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. లేనిపక్షంలో రెండవ తేదీన తాగునీరు వీధిలైట్లు పారిశుధ్యం బహి ష్కరించి సమ్మె బాట పడతామని పంచాయతీ కార్మికులు ఏక కంఠంతో తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు వెంకట రవణమ్మ, రోశమ్మ, నాగమ్మ, అలేఖ్య, సువార్తమ్మ, వెంకటమ్మ, ధనమ్మ, రమణమ్మ, వెంకటయ్య, బాబు, లాజర్‌ పాల్గొన్నారు.