Aug 30,2023 21:14

భోజన విరామ సమయంలో నిరసన తెలుపుతున్న ఎల్‌ఐసి ఉద్యోగులు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
ఎల్‌ఐసి సిబ్బంది వేతన సవరణను వెంటనే అమలు చేయాలని ఎల్‌ఐసి ఉద్యోగుల సంఘం (ఐసిఈయు) నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం ఎల్‌ఐసి కార్యాలయం ఎదుట భోజన విరామ సమయంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు విజరు కుమార్‌, వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు రఘునాథ్‌ గౌడ్‌, ఎల్‌ఐసి క్లాస్‌-1 ఉద్యోగుల సంఘం నాయకులు మహేష్‌ కుమార్‌, డెవలప్‌మెంట్‌ ఆఫీసర్ల సంఘం నాయకులు సుధాకర్‌ రావు, మొయినుద్దీన్‌ మాట్లాడారు. డిమాండ్ల సాధన కోసం సెప్టెంబర్‌ 12న 2 గంటల పాటు వాకౌట్‌ సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 30 శాతం ఫ్యామిలీ పింఛను, ఎన్‌పిఎస్‌ సిబ్బందికి 14 శాతం యాజమాన్యం కాంట్రిబ్యూషన్‌ ఇవ్వాలని కోరారు. వేతన సవరణ చర్చలు, అన్ని కేడర్లలో నూతన రిక్రూట్‌మెంట్‌ చేపట్టాలని, సిబ్బంది సమస్యలపై యాజమాన్య ఏకపక్ష ధోరణి వీడాలని డిమాండ్‌ చేశారు. సిబ్బంది గోవర్ధన్‌, మురళీ, రాము, శంకర్‌, నజీర్‌ అహ్మద్‌, ఫైరోజ్‌, హంపయ్య, బ్రహ్మారెడ్డి, వీరారెడ్డి, క్రాంతి పాల్గొన్నారు.