May 03,2023 22:21

తాగునీటిని అందజేస్తున్న నాయకులు

పుట్టపర్తి అర్బన్‌ : పుట్టపర్తి మున్సిపాలిటీ లోని 20 వార్డులలో వేసవికాలం ముగిసే వరకు తాగునీరు సరఫరా చేస్తామని టిడిపి జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ తెలిపారు. పట్టణంలోని పెద్ద బజారులో తాగునీటి సరఫరా ట్యాంకరును మాజీ జెడ్పీటీసీ చెన్నకేశవులు ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ పట్టణంలో పలు చోట్ల తాగునీటి సమస్య ఉందని పలువురు తమ దష్టికి తెచ్చారన్నారు. దీంతో తన సొంత ఖర్చులతో ఉచితంగా మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు ఫిల్టర్‌ నీటిని అందించాలని నిర్ణయించుకొన్నామన్నారు. వేసవిలో ఎక్కడ నీటితో ఇబ్బందులు పడకూడదనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. అవసరమైతే అదనంగా మరో టాంకర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఎవరు నీరు కావాలని ఫోన్‌ చేస్తే వారికి నీరు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు అమ్మినేని కేశవ నాయుడు, ఐటిడిపి నియోజకవర్గం అధ్యక్షులు జయప్రకాష్‌, బేకరీ నాయుడు, శామీర్‌, జావిద్‌, కోనంకి సూరి, లెక్కల లింగప్ప, ఆంజనేయులు, సాయి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.