Jun 06,2023 16:25

వేసవి దుక్కుల్లో నిమగ్నమైన రైతు

వేసవి దుక్కులు పంటకు మేలు
_ అదునులోనే అప్రమత్తమైతే బహుళ ప్రయోజనాలు
_ లోతైన దుక్కులతో భూసారం మెరుగు
ప్రజాశక్తి - చాగలమరి

    పంట పొలాల్లో వేసవి దిక్కులు చేయడం వల్ల పంట దిగుబడులకు ఎంతో మేలు కలుగుతుందని మండల వ్యవసాయ అధికారి రంగ నేతాజీ తెలుపుతున్నారు. వేసవి  దుక్కుల గురించిన పలు విషయాలను ఆయన ప్రజాశక్తితో పంచుకున్నారు. కలుపు యాజమాన్య ప్రక్రియ వేసవికాలం నుంచే చేపడితే కలుపు మందులను ఆశ్రయించకుండా రైతులు ప్రత్యామ్నాయ పద్ధతులపై దృష్టి సారించడానికి వీలు కలుగుతుంది. అంతేకాకుండా భూమిని లోతు దిక్కులు దినం వల్ల మిగిలిపోయిన కలుపు మొక్కలను పూర్తిగా నాశనం చేయవచ్చు. సెనగ మిరప మినుము పెసర మొక్కజొన్న తదితర పంటలు పూర్తి అయిన తర్వాత మిగిలిన కలుపు మొక్కలు తొలకరి వర్షాలకు అధికంగా విత్తనోత్పత్తి చేసుకుంటాయి.ణ అందువల్ల వేసవిలో తప్పనిసరిగా లోతు దిక్కులు దున్నాలి. ఇలాంటి దుక్కుల వలన భూమిలో ఉన్న కీటకాలు గుడ్లు, లార్వాలు చనిపోవడంతో పాటు గడ్డి జాతులు అయిన తుంగ గరికను అరికట్టవచ్చు. భూమిలోని పోషకాలు కూడా పెరగడంతో పాటు పంట దిగుబడి బాగా వస్తుంది.. లోతు దిక్కులు నేలను చదును చేసే పనులే కాకుండా వేసవిలో వచ్చే జల్లులు తొలకరి వర్షాలకు ఉపయోగించుకొని నేల అవసరాన్ని బట్టి పై పొరల్లోని కలుపు విత్తనాలు కూడా చాలా వరకు మొలక దశలోనే అంతరించిపోతాయి. ఇతర కలుపు జాతులైన కూడా చెప్పారా గిరంగి నేల ఉసిరి తదితర మొక్కలంటే లోతు దుక్కులు దున్నడం వల్ల అటువంటి మొక్కలు నశిస్తాయి. ఆరుతడి పంటగా వరి సాగు చేసినప్పుడు పత్తి మిరప మొక్కజొన్న మినుము పెసర తదితర పంటల సాగుకు ముందే వేసవిలో లోతు దుక్కులు దున్నుకోవాలి. ఎండ సైతం భూమి పొరల్లోకి తెచ్చుకొని  వెళ్లి క్రిమి కీటకాలను నాశనం చేస్తుంది.
 భూసార పరీక్షలు తప్పనిసరి.....
ప్రతి రైతు వారి వారి పొలంలో భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి.. ఈ భూసార పరీక్షల వల్ల భూమిలోని పోషక విలువలు తెలియడంతో పాటు పంటల దిగుబడులకు అవసరమైన ఎరువులను ఏ మోతాదులో వాడాలో రైతులు తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. తద్వారా పంట సాగు ఖర్చులు కూడా తగ్గవచ్చు.
దుక్కులు పూర్తయిన తర్వాత.......
దుక్కుల అనంతరం పిల్లి పెసర, జనుము ,జీలగా పచ్చిరొట్ట పైర్లుగా పొలంలో వేయడం వల్ల భూసారం పెరిగే అధిక దిగుబడులు లభిస్తాయి. అంతేకాకుండా ఖరీఫ్ సీజన్లో పండించే వరికి రబీ సీజన్లో పండించే మినుములు, పెసలు మొక్కజొన్న తెల్లజన్న పంటలలో చీడ బిలడదలను తట్టుకునే శక్తి ఈ పచ్చిరొట్ల పైర్లు వేసిన పొలాల్లో ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతము ప్రతి ఆర్.బి.కె కేంద్రాల ద్వారా సబ్సిడీ మీద పచ్చి రొట్టెపైర్లు అందుబాటులో ఉన్నాయి.
లోతైన దుక్కులతో భూసారం మెరుగు_ రంగ నేతాజీ (ఏఓ)
    రైతులు వేసవి వెళ్ళకముందే లోతైన దుక్కులు దున్నాలి. పొలానికి అడ్డంగా దున్నడంతో భూమిలోని చీడపురుగులు నశించిపోతాయి. తగినంత తేమ ఉన్నప్పుడు దుక్కులు వాలుగా లోతుగా దున్నితే నేలకోటకు గురవకుండా ఉంటుంది. దున్నిన తర్వాత రైతులు పంటల సాగుకు వేప గింజల మిశ్రమాన్ని చేల్లో పిచికారి చేయాలి. దీంతో క్రిమి కీటకాలు పంటను ఆశించవు. క్రిమి సంహారక మందులు వాడకుండా ఉండడమే మంచిదని శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు. జిలగలు 50 శాతం సబ్సిడీపై రైతులకు అందజేస్తున్నాము.