తిరుమల శ్రీవారి గరుడసేవలో డిజిపి కసిరెడ్డి రాజేంద్రనాధ్‌రెడ్డి , టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ఎవి ధర్మారెడ్డి
వేడుకగా గరుడసేవ
ప్రజాశక్తి - తిరుమల
శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడసేవ గురువారం రాత్రి 6.30 గంటలకు ప్రారంభమయ్యింది.. బ్రహ్మోత్సవాల్లో ఈ గరుడసేవకు అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. అయితే ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నా భక్తుల సందడి తక్కువగానే ఉందని చెప్పవచ్చు. రెండోసారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు పెద్దసంఖ్యలో భక్తులు వస్తారని టిటిడి అంచనా వేసినా ఆస్థాయిలో సందడి కనిపించకపోవడం గమనార్హం. ఏదిఏమైనా ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో భక్తుల సందడి తక్కువనే చెప్పవచ్చు.
తిరుమల శ్రీవారి గరుడసేవలో డిజిపి కసిరెడ్డి రాజేంద్రనాధ్‌రెడ్డి , టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ఎవి ధర్మారెడ్డి