Apr 11,2023 22:55

కదిరిలో పోస్టరు అతికిస్తున్న డాక్టర్‌ హరిప్రసాద్‌

హిందూపురం : వైసిపి ప్రభుత్వంతోనే ప్రజారంజక పాలన సాధ్యమని వైసిపి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ పేర్కొన్నారు. మంగళవారం హిందూపురం పురపాలక సంఘంలో పలు వార్డుల్లో జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయా వార్డుల కౌన్సిలర్లతో కలిసి ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలు వివరిస్తు, ప్రజల సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజ, 34వ వార్డు కౌన్సిలర్‌ మద్దెన జయప్ప, 7వ వార్డు కౌన్సిలర్‌ నాసీర బాను, ఇతర కౌన్సిలర్లు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.
కదిరి టౌన్‌ : కదిరి మునిసిపాలిటీ 10 వ వార్డు కౌన్సిలర్‌ దిల్షాద్‌ ఉన్నీసా అధ్వర్యంలో గాంధీ నగర్‌లో జగనన్న నువ్వే మా నమ్మకం, మా భవిష్యత్తు అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్‌ కె ఎస్‌ దిల్షాదున్నీసా, కదిరి పట్టణ అధ్యక్షులు కె ఎస్‌ బహవుద్దీన్‌, వైసిపి రాష్ట్ర లీగల్‌ సెల్‌ ప్రధాన కార్యదర్శి, లింగాల లోకేశ్వర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బుక్కపట్నం : పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా వైసిపి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని అగ్రహారం, రాసింపల్లి గ్రామాలలో జగనన్నే మా భవిష్యత్‌, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. అనంతరం జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీధర్‌ రెడ్డి, జెడ్పీటీసీ శ్రీలత గోవర్ధన్‌ రెడ్డి ఎంపీడీవో శ్రీనివాసులు, ఎంపీటీసీ హర్ష, నాయకులు హనుమంత రెడ్డి, కేశప్ప, రమణారెడ్డి, వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
కదిరి టౌన్‌ : ముఖ్యమంత్రి జగనన్నను మరో మారు ఆశీర్వదించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ హరిప్రసాద్‌ కోరారు. ఈ మేరకు జగనన్న మా నమ్మకం కార్యక్రమాన్ని మంగళవారం కదిరి రూరల్‌ కుమ్మరవాండ్లపల్లి గ్రామ పంచాయతీలో ప్రారంభించారు. ఈసందర్భంగా ఆరు ప్రజలను కలిసి జగనన్న ప్రభుత్వం ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వైసిపి పట్టణ అధ్యక్షులు బాహుద్దీన్‌, రాష్ట్ర లీగల్‌ సెల్‌ ప్రధాన కార్యదర్శి లింగాల లోకేశ్వర్‌ రెడ్డి, కదిరి రూరల్‌ వైస్‌ ఎంపిపి బత్తల ఆదినారాయణ,బీసీ ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సంపంగి గోవర్ధన్‌, నాయకులు ఏసు రత్నం, అన్వర్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం తలుపుల మండలం సిద్దుగురిపల్లి గ్రామంలో చర్చి అభివృద్ధికి రూ 10వేలను అందజేశారు.