ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
వైసిపిపై సమరానికి సిద్ధంగా ఉన్నామని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బీవీ.జయనాగేశ్వర రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక సోమప్ప సర్కిల్‌లో మాజీ మంత్రి, కీర్తిశేషులు బీవీ.మోహన్ రెడ్డి వర్థంతి నిర్వహించారు. బీవీ.మోహన్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వాస్పత్రిలో రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీవీ మాట్లాడారు. తమ తండ్రి పేరు లేకుండా చేయాలని ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి కుట్ర చేశారని తెలిపారు. ఎమ్మిగనూరు ప్రజల గుండెల్లో ఆయన ఉంటారని చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మోహన్ రెడ్డి పేరును ప్రజల మనుషుల నుంచి చెరపలేరన్నారు. ఎమ్మిగనూరు నుంచి వరసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎన్‌టి.రామారావు, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అనేక పర్యాయాలు మంత్రిగా కొనసాగారని తెలిపారు. రాష్ట్రంలో తిరుగులేని నాయకునిగా ముద్ర వేసుకుని, ఎమ్మిగనూరు నియోజకవర్గానికి రాష్ట్రస్థాయిలో పేరు, ప్రఖ్యాతలు తెచ్చారని అన్నారు. టిడిపి నాయకులు కొండయ్య చౌదరి, రామదాసు గౌడ్, దయాసాగర్, రామకృష్ణ నాయుడు, సుందర్ రాజు, నేసే మల్లికార్జున, పార్లపల్లి మల్లికార్జున, మధుబాబు, రంగస్వామి గౌడ్, చిన్న రాముడు, గడ్డం నారాయణ రెడ్డి, కాశీమ్ వలీ, గోపాల్, రమేష్ నాయుడు, నజీర్ అహ్మద్, కటారి రాజేంద్ర పాల్గొన్నారు. గోనెగండ్లలోని టిడిపి కార్యాలయంలో మాజీ మంత్రి బీవీ.మోహన్ రెడ్డి వర్థంతి నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టిడిపి మండల నాయకులు నజీర్ సాహెబ్, గాజులదిన్నె హనుమంతు, తిరుపతయ్య నాయుడు, కులమాల రాముడు, శ్రీధర్ నాయుడు, రమేష్ నాయుడు, రంగస్వామి నాయుడు, నాయకులు అడ్వకేట్ చంద్ర, వెంకటేశ్వర్లు, మదీన, అచ్చుగట్ల కొత్తింటి ఫక్రుద్దీన్, ఎర్రబాడు శీను, రాంపురం లాలు, చేపల చంద్ర పాల్గొన్నారు.










