వైసిపి కండువా కప్పి ఆహ్వానిస్తున్న బొజ్జమ్మ
ప్రజాశక్తి- దేవనకొండ
మండలంలోని పి.కోటకొండ గ్రామానికి చెందిన 25 కుటుంబాలు వైసిపి మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు కప్పట్రాళ్ల బొజ్జమ్మ సమక్షంలో సోమవారం వైసిపిలో చేరాయి. గ్రామానికి చెందిన భాస్కర్, తిరుపతమ్మ, జక్కల హరి, మద్దిలేటి, రామచంద్ర, బాల గంగాధర్, రంగముని, మారెప్ప, చిన్న రంగన్న, రంగుడుకు బొజ్జమ్మ వైసిపి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పార్టీలోకి చేరిన వారికి తగిన ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. 2024 ఎన్నికల్లో వైసిపిని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. మాజీ ఎంపిపి రామచంద్ర నాయుడు పాల్గొన్నారు.










