వైసిపికి నూకలు దగ్గర పడ్డాయి : టిడిపి
ప్రజాశక్తి - విలేకరులు
టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టిడిపి శ్రేణులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
మంత్రాలయం : తప్పు చేయని చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన వైసిపి ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో నూకలు దగ్గరపడ్డాయని టిడిపి మంత్రాలయం నియోజకవర్గ ఇంచార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మేము సైతం అంటూ స్థానిక రాఘవేంద్ర సర్కిల్లో 15వ రోజు చేపట్టిన రీలే నిరహార దీక్షలో పెద్దకడూబురు మండలం క్లస్టర్, యూనిట్, బూతు ఇన్‌చార్జ్‌లు కూర్చున్నారు. ఈ సందర్భంగా పాలకుర్తి తిక్కారెడ్డి మాట్లాడుతూ ఏ తప్పు చేయని మా తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబా బుపై అక్రమ కేసులు పెట్టడం వైసిపి తుగ్లక్ పాలనకు నిదర్శనం అన్నారు. వైసిపి చేస్తున్న నియంతత్వ పాలనను ప్రజలు గమనిస్తున్నారని రానున్న రోజుల్లో మీకు తగిన బుద్ధి ప్రజలు చెపుతారని హెచ్చరిం చారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో, నియోజకవర్గం లోనూ టిడిపిదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. ఈ దీక్షలో పెద్దకడూబురు మండలం క్లస్టర్ ఇన్ చార్జ్ లు నరవ రమాకాంత్ రెడ్డి, బాబురావు, మండల కన్వీనర్ బసలదోడ్డి ఈరన్న, ఆర్ టి యస్ కన్వీనర్ దశరధిరాముడు, టౌన్ అధ్యక్షులు కురువ మల్లికార్జున, మీ సేవా ఆంజనేయులు, బోగ్గుల నరసన్న, తలారి అంజీ, నరసన్న, మహదేవ్, హనుమన్న, బెల్లమయ్య, ముని, పెద్దయ్య, మల్దకల్, యోహాను, యంకన్న, ముక్కరన్న, తోపాటు అన్ని గ్రామాలు నాయకులు కార్యకర్తలు దీక్షలో కుర్చున్నారు. ఈ దీక్షకు మద్దతుగా టిడిపి నియోజకవర్గ పరిశీలకులు శివబాల టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షులు పన్నగ వెంకటేష్ స్వామి, అశోక్ రెడ్డి,బూదూరు మల్లికార్జున రెడ్డి, ఏసేబు, బిసి సెల్ అధ్యక్షులు మాధవరం అమర్నాత్ రెడ్డి, బిసి సీనియర్ నాయకులు వక్రాని వెంకటేశ్వర్లు, నాడిగేని అయ్యన్న,పవన్ కూమర్, ఈరన్న,నరసింహ రెడ్డి,గవిగట్టు ఈరయ్య, ప్రభాకర్ రెడ్డి, గుండేష్, ఉసేని, యస్ సి సెల్ నాయకులు మారెప్ప, యోబు, నల్లా రెడ్డి, సత్యన్న గౌడ్, హనుమంతు, టి యన్ యస్ ఎఫ్ మండల అధ్యక్షులు సుధ సిపిఐ నియోజ కవర్గ కార్యదర్శి భాస్కర్ యాదవ్ నాయకులు కార్యకర్తలు తదితరులు సంఘీభావం తెలిపారు.
భవ్య శ్రీ హత్యపై స్పందించక పోవడం సిగ్గుచేటు
- టిడిపి నియోజకవర్గ పరిశీలకులు శివబాల
బిసి విద్యార్థిని భవ్య శ్రీని అతి కిరాతకంగా హత్య చేసిన ఘటనపై వైసిపి ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించిక పోవడం సిగ్గుచేటని టిడిపి నియోజకవర్గ పరిశీలకులు శివబాల విమర్శించారు. స్థానిక రాఘ వేంద్ర సర్కిల్లో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలో ఆమె మాట్లాడుతూ మహిళల రక్షణపై మంత్రి మంత్రి రోజా మాట్లాడు కుండా అసెంబ్లీలో ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం సరికాదన్నారు. బాబును విడుదల చేసే వరకు దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు.
ఎమ్మిగనూరు : చంద్ర బాబు ను విడుదల చేసే వరకు పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి, అన్నారు. సోమప్ప సర్కిల్‌లో 14 రోజు నిరాహార దీక్షలను బీవీ జయనాగేశ్వర రెడ్డి ప్రారంభించారు. అనంతరం బీవీ జయనాగేశ్వర రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు శ్రీరాము లు మా ట్లాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సుందర్ రాజు, మిఠాయి నరసింహులు, కొండయ్య చౌదరి, రామదాసు గౌడ్, దయాసా గర్, మునీర్, రామకృష్ణ నాయుడు, రంగస్వామి గౌడ్, కటారి రాజేంద్ర, దామ నరసింహులు, బంద నవాజ్, శాబీర్,పార్ల పల్లి మల్లికార్జున, బోయ రంగన్న, నజీర్, అల్తాఫ్, మురళి రెడ్డి, కొండన్న గౌడ్, శంకర్ గౌడ్, డీలర్ ఈరన్న, దాదా వలి,నాగేష్ ఆచారి, శిల్పి భాస్కర్, సలీం, సలాం, గౌస్, ఈశ్వర్, యు రవి, కృష్ణతేజ నాయుడు, పాల్గొన్నారు. గోనెగండ్ల: తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును వెంటనే విడుదల చేయాలని కోరుతూ గోనెగండ్ల మండల తెలుగు యువత ఆధ్వర్యంలో మండల పరిధిలోని గాజులదిన్నె ప్రాజెక్టు నీటిలో జల దీక్ష నిరసన తెలిపారు. తెలుగు యువత మండల అధ్యక్షుడు రంగస్వామి నాయుడు మాట్లాడుతూ కక్ష సాధింపుతోనే వైసిపి ప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు బనాయించారని, త్వరలోనే చంద్రబాబు స్వచ్ఛంగా విడుదల అవుతారని అన్నారు. తెలుగు యువత నాయకులు పిల్లిగుండ్ల జయపాల్, రమేష్ ఆచారి, చిన్ననేలటూరు హరికృష్ణ, గోవర్ధన్ నాయుడు, రామకృష్ణ, శ్రీను, అబూబక్కర్, షేక్షావలి, నీలకంఠ, రాజు, ఖాసిం పాల్గొన్నారు. ఆదోని : చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ ఆదోనిలోని ఎన్‌టిఆర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసుకున్న న్యాయ దేవత వేషధారణ ముందు కాపాడాలంటూ టిడిపి శ్రేణులు నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, ఉమాపతి నాయుడు మాట్లా డారు. ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టించడం అన్యాయమన్నారు. నాయకులు రంగస్వామి నాయుడు, తిమ్మప్ప, ఆరెకల్ రామకృష్ణ, బసాపురం రామస్వామి, వెంకటేష్ ,మల్లి మారుతి నాయుడు విరుపాపురం స్వామినాథ ఉన్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద.. టిడిపి సీనియర్ నాయకులు చేపట్టిన రిలేదీక్షలు 15వ రోజుకు చేరాయి. ఈ సందర్బంగా టిడిపి సీనియర్ నాయకులు సూరం భాస్కర్ రెడ్డి, మాన్వి దేవేంద్రప్ప, సౌదీ రాహుఫ్ మాట్లాడారు. ఏ తప్పు చేయని చంద్రబాబుని అక్రమ అరెస్టు చేయడం దారుణం అన్నారు. ఫక్రుద్దీన్ సోమసేకర్ రెడ్డి,శేక్ష వలి, అంజి ఉన్నారు. ఆలూరు : చద్రబాబును అక్రమ అరెస్ట్ చేయడం అప్రజాస్వామ్యం అని టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్ కోట్ల సుజాతమ్మ అన్నారు. మంగళవారం చంద్ర బాబు నాయుడు అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఆలూరు కోర్టు ముందు టిడిపి న్యాయవాదులు 'మేము సైతం బాబు కోసం' అంటూ నిరాహారదీక్ష చేపట్టారు. న్యాయవాదులకు టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్ కోట్ల సుజా తమ్మ పూలమాల వేసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ త్వరలోనే చంద్రబాబు కడిగిన ఆణి ముత్యంలా బయటికి వస్తాడన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు వాయుజీవోత్తమ రావు, శేక్షవలి, ప్రవీణ్ కుమార్ ,కె.రవి,సిద్ధప్ప,జ్యోతి,ప్రసాద్ టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.










