Sep 17,2023 21:51

వృద్ధురాలికి బుక్‌లెట్‌ను అందజేస్తున్న డిప్యూటీ సిఎం రాజన్నదొర

సాలూరు రూరల్‌: వైసిపి ప్రభుత్వం సంక్షేమమని డిప్యూటీ సిఎం రాజన్నదొర తెలిపారు. మండలంలోని పురోహితునివలసలో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉండే అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తరుఫున సంక్షేమ పథకాలను అందించాలని లక్ష్యంతో పనిచేస్తుందన్నారు. ఇందులో భాగంగా సాలూరు గతంలో ఎన్నడూ లేనివిధంగా నేడు నేరుగా లబ్ది దారుని ఖాతాలో జమ చేస్తున్నామన్నారు. ఇంకా సంక్షేమం అందని వారికి కూడా వాలంటీర్లు ద్వారా సర్వే చేయించి వారికి కూడా పథకాలను అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపి జి.రాములమ్మ, వైస్‌ ఎపిపి రెడ్డి సురేష్‌, సర్పంచ్‌ బంకూరు తిరుపతిరావు, ఎఎంసి వైస్‌ చైర్మన్‌ బంకురు శ్రీనివాసరావు, సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.