ప్రజాశక్తి - ఆదోని
నవరత్నాల పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు అమలు చేస్తూ ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా నిలిపారని ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు. మంగళవారం పట్టణంలోని హనుమాన్ నగర్ 42వ వార్డు మసా మసీదు ప్రాంతంలో 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైసిపి ప్రభుత్వ పాలనపై ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతోందని తెలిపారు. దీనిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ఎన్ని కుట్రలు పన్నినా 2024లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. పట్టణంలో తాగునీటి ఎద్దడి రాకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రూ.10 కోట్లతో బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు బండ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నీటి ఎద్దడి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. మున్సిపల్ ఛైర్మన్ బోయ శాంత, జిల్లా వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ నియాజ్ అహ్మద్, స్టేట్ డైరెక్టర్ రేణుక, అన్ను, మార్కెట్ యార్డు ఛైర్మన్ మజార్ అహ్మద్, వైస్ ఛైర్మన్ తిమ్మప్ప, వార్డు ఇన్‌ఛార్జీ నాగరాజ్, వైసిపి పట్టణ అధ్యక్షులు దేవా, కౌన్సిలర్ లోకేశ్వరి, సురేష్, ఎగ్బాల్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎంఎంజి.గౌస్, రామలింగేశ్వర యాదవ్, ఫయాజ్, చిన్న ఈరన్న, శ్రీలక్ష్మి, లక్ష్మీనారాయణ, వీరాంజి, సీనా, వెంకటేష్, బికె.లక్ష్మన్న, శంకర్, నాగ, లాల్ బాష, రహీం, మలేకర్, గోవిందు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి










