Apr 23,2023 22:07

వైసిపి ప్రభుత్వానికి సెల్ఫీ చాలెంజ్‌ చేస్తున్న సవితమ్మ

ప్రజాశక్తి -పెనుకొండ :: మండలంలోని గొల్లపల్లి రిజర్వాయర్‌ నిర్మాణం అతి వేగంగా పూర్తి చేసి కృష్ణ జలాలను గొల్లపల్లి రిజర్వాయర్‌లో నింపి పెనుకొండ నియోజకవర్గంలో తాగు, సాగునీటి సమస్యను, హిందూపురానికి తాగునీటి సమస్యను తీర్చిన ఘనత చంద్రబాబు నాయుడుదే అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ అన్నారు. ఈ మేరకు ఆమె ఆదివారం గొల్లపల్లి వద్ద పార్టీ నాయకులతో కలసి వైసిపి ప్రభుత్వానకి సెల్ఫీ ఛాలెంజ్‌ చేశారు. హిందూపురానికి తాగు నీటి కోసం రూ 190 కోట్లతో ఇక్కడి నుండే పంపింగ్‌ చేస్తున్నారన్నారు. అదేవిధంగాగా పెనుకొండ పట్టణంలో తాగునీటి అవసరాలకు రూ. 10 కోట్లతో పథకం అమలు చేశామన్నారు. ఇంకా అనేక చెరువులను మొదటిసారి కృష్ణ జలాలను నింపిన చరిత్ర గత తెలుగుదేశం ప్రభుత్వానిది అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇరిగేషన్‌ ప్రాజెక్టులను రిజర్వాయర్లను పూర్తిగా గాలికి వదిలేసారన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బాబుల్‌ రెడ్డి, త్రివేంద్ర నాయుడు, మావటూరు గోపాల్‌, వాసుదేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.