వైసిపి పాలనలో అభివృద్ధి శూన్యం : రావి
ప్రజాశక్తి-గుడ్లవల్లేరు
రాష్ట్రంలో వైసిపి పాలనలో అభివృద్ధి శూన్యమని గుడివాడ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి రావి వెంకటేశ్వరావు విమర్శించారు. గుడ్లవల్లేరు మండలంలోని కూరాడ గ్రామంలో 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రావి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రం అభివద్ధి చెందాలంటే టిడిపి తిరిగి అధికారం చేపట్టాలన్నారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే అన్ని తరగతుల ప్రజలకు న్యాయం జరుగుతుందని వివరించారు. గ్రామ టీడీపీ నాయకులు కల్యాణపు నవాబు, బాసా రామచంద్రావు, బొర్రా నాగేశ్వరావు, శాయినా దుర్గా, శీరం నాగ రమేష్, పులి ప్రసాద్, మాదాసు ప్రసాద్, లంకా గణపతి ఆకుల శివయ్య. పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అవనిగడ్డ : తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇదేమి కర్మ కార్యక్రమాన్ని శుక్రవారం పంచాయతీ పరిధిలోని మూడో వార్డులో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు పెరిగిన విద్యుత్ చార్జీలు, గ్యాస్ ధరలు, ఇంటి, చెత్త పన్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రభుత్వంలో పెంచిన పన్నులు కట్టలేక పేద, మధ్యతరగతి ప్రజలు అల్లాడుతున్నారన్నారు. ప్రభుత్వం విద్య, వైద్యం, మౌలిక వసతులు విస్మరించి రాష్ట్ర అభివృద్ధిని అధోగతి పాల్జేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి, యాసం చిట్టిబాబు, ఘంటసాల రాజమోహనరావు, అన్నపరెడ్డి లక్ష్మీనారాయణ, అన్నపురెడ్డి వెంకటేశ్వరరావు, యలవర్తి చిన్న, లుక్కా శ్రీనివాసరావు, బచ్చు రఘునాథ్, బర్మా శ్రీనివాసరావు, బండే రాఘవ తదితరులు పాల్గొన్నారు.










