Apr 09,2023 22:31

vyyuru lo

వైసిపి పాలనలో అభివృద్ధి శూన్యం : బోడే
ప్రజాశక్తి-ఉయ్యూరు
రాష్ట్రంలోని వైసిపి పాలనలో అభివృద్ధి శూన్యంగా మారిందని టిడిపి పెనమలూరు ఇన్చార్జ్‌ బోడే ప్రసాద్‌ విమర్శించారు. ఉయ్యూరు నగర పంచాయతీ 7వ వార్డ్‌లో టిడిపి అధ్యక్షుడు పెన్నేరు నందకిషోర్‌ ఆధ్వర్యంలో 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత మూడున్నర రేళ్ళ జగన్‌ రెడ్డి పాలన విధ్వాంసకరంగానూ, దోపిడీని తలపించేలా ఉందన్నారు. అప్రజాస్వామిక పాలనను అంతమొందించేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి టౌన్‌ అధ్యక్షుడు జంపాన గురునాథం, మాజీ చైర్మన్‌ జంపాన పూర్ణచంద్రరావు, అబ్దుల్‌ ఖుదుసు, కోనపరెడ్డి వాసు, పండ్రాజు చిరంజీవి, పల్లెల శ్రీను, బూరెల నరేష్‌, జయదేవ్‌, ఎల్‌పి రఫీ, ఈడే అంజిబాబు, పేరేపి నరేష్‌, ఎ.అప్పలనాయుడు, పామర్తి శివ, చలపాటి శీను, సుంకర అయ్యప్ప పాల్గొన్నారు.