Sep 12,2023 20:25

పరామర్శిస్తున్న బందే నవాజ్‌

ప్రజాశక్తి - గోనెగండ్ల
గోనెగండ్లలో అనారోగ్యానికి గురైన వైసిపి సీనియర్‌ కార్యకర్తను మాజీ కోఆప్షన్‌ సభ్యులు, వైసిపి యూత్‌ నాయకులు టి.బందే నవాజ్‌ మంగళవారం పరామర్శించారు. గోనెగండ్ల గ్రామానికి చెందిన వైసిపి సీనియర్‌ కార్యకర్త కడపల వెంకటేష్‌ గత కొంత కాలంగా పెరాలసిస్‌తో అనారోగ్యానికి గురయ్యారు. బందే నవాజ్‌ ఆయన స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. గాజుల ఉస్మాన్‌, కటిక సుభాన్‌, బగిలి రఫీ, కౌలుట్లయ్య పాల్గొన్నారు.