ప్రజాశక్తి-కనిగిరి: వైసిపి ప్రభుత్వ అరాచక పాలనకు చరమగీతం పాడాలని టిడిపి కనిగిరి నియోజకవర్గం ఇన్‌ఛార్జి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. కనిగిరి మండలం పునుగోడు ఎస్సీ బీసీ కాలనీలో 'మన ఊరు మన ఉగ్ర' కార్యక్రమం రెండో రోజు కొనసాగగా ఆయన పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకుంటూ చైతన్య పరుస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా టిడిపి జెండా ఎగురవేశారు. బాబుతో నేను కరపత్రాలు పంపిణీ చేస్తూ చంద్రబాబు అక్రమ అరెస్టు గురించి ప్రజలకు వివరించారు. ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కనిగిరి మండల పార్టీ అధ్యక్షులు నంబుల వెంకటేశ్వర్లు, టిడిపి నాయకులు ముచ్చుమారి చెంచిరెడ్డి, షేక్ ఫిరోజ్, షేక్ అహ్మద్, నుదురుపాటి సుబ్బయ్య, మాలపాటి ఓబుల్‌రెడ్డి, తమ్మినేని వెంకటరెడ్డి, బారుమామ్, పాలూరి సత్యం, చింతలపూడి తిరుపాలు తదితరులు పాల్గొన్నారు.










