ఆర్థికసాయం అందజేస్తున్న నాయకులు
ప్రజాశక్తి -పెద్దకడబూరు
మండలంలోని చిన్నతుంబలం గ్రామంలో మృతి చెందిన కురువ లక్ష్మన్న కుటుంబ సభ్యులకు మంగళవారం తక్షణ సహాయంగా రూ.10 వేలను అందజేశారు. వైఎస్‌ఆర్ బీమా కింద మృతుని భార్య కురువ ఉసేనమ్మకు ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు ఆర్థిక సహాయం అందజేశారు. వైస్ ఎంపిపి కె.ముత్తమ్మ, ఎంపిటిసి కెపి.ఎల్లప్ప, హైస్కూల్ ఛైర్మన్ బొడ్డన్న, వెల్ఫేర్ అసిస్టెంట్ పుణ్యవతి, మదిరి రాముడు, కె.బ్రహ్మయ్య, మల్లయ్య, ప్రభుదాసు, ఈరన్న, నరసింహ ఆచారి పాల్గొన్నారు.










