ప్రజాశక్తి-పుట్టపర్తి రూరల్ : వైఎస్సార్ ఆసరా సాయం ద్వారా మహిళలు ఆర్థిక ప్రగతి బాట పడుతున్నారని పుట్టపర్తి శాసనసభ్యులు దద్దుకుంట శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక సాయి ఆరామం పక్కన డ్వాక్రా మహిళలకు మూడవ విడత ఆసరా రుణమాఫీ మెగా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట మేరకు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తున్నారని చెప్పారు. అందులో భాగంగా మూడో విడత ఆసరా నిధులు విడుదల చేశారన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ పథకాలను వైఎస్.జగన్మోహన్‌రెడ్డి ప్రజల కోసం అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ పథకాల వర్తింపులో ఎలంటి వివక్ష చూపకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ వర్తింపజేస్తున్నట్లు చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం మండలాల చెందిన 19,273 మంది డ్వాక్రా మహిళలకు మూడవ విడత ఆసరా కింద మంజూరైన రూ.14,85,37,145 మెగా చెక్కును మహిళలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అమరాపురం : మహిళాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి పేర్కొన్నారు. వైఎస్‌ఆర్ ఆసరా వారోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని వైఎస్‌ఆర్ క్రాంతి పథకం కార్యాలయ ఆవరణంలో మహిళలకు ఆసరా పథకం ఎపిఎం తిమ్మప్ప అధ్యక్షతన ప్రత్యేక సమావేశం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు ఏరియా కోఆర్డినేటర్ ప్రసాద్, ఎంపీడీవో మునిస్వామి, జెడ్పీటీసీ స్వర్వక్క నరసింహమూర్తి, ఎంపిపి ఈరన్న, వక్కలిగ కార్పొరేషన్ చైర్‌పర్సన్ నళిని రంగే గౌడ్, క్రిస్టియన్ డైరెక్టర్ సుందర్ రాజు, సింగల్ విండో అధ్యక్షులు చిక్కన్న తదితరులు పాల్గొన్నారు: మండలంలో ఎనిమిది వందల తొంబై ఐదు సంఘాలకు గాను రూ. 7,43,77889ల లబ్ధి చేకూరిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు శ్రీనివాస్ రెడ్డి, కించప్ప, గడ్డం రాజు, మాజీ సర్పంచి ప్రసాద్ స్వామి, నారాయణ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
నల్లచెరువు : వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో వస్తేనే సంక్షేమ పథకాలు అమలు అవుతాయని ఎమ్మెల్యే పివి. సిద్ధారెడ్డి అన్నారు. స్థానిక గీత మందిరంలో గురువారం ఏర్పాటుచేసిన 3,వ విడత వైయస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ఎక్కడా వెనకడుగు వేయకుండా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శకుంతల, ఎంపీపీ రమణారెడ్డి, ఎపిఎం రమణమ్మ, వైస్ ఎంపీపీ నారాయణస్వామి, సర్పంచి పంచరత్నమ్మ, ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, డాక్టర్ శంకర్, రాజప్ప, ఎంపీటీసీలు, సర్పంచులు, డ్వాక్రా సంఘాల మహిళలు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పెనుకొండ : రాష్ట్రంలో మహిళల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే శంకర్ నారాయణ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో వైఎస్‌ఆర్ ఆసరా మూడవ విడత సంబరాలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులతో కలిసి ఎమ్మెల్యే శంకర్నారాయణ, ఎమ్మెల్సీ మంగమ్మ తదితరులు సిఎం జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులకు మెగా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గీతా రామ్మోహన్ రెడ్డి, ఎంపీడీవో శివశంకరప్ప, వైసిపి నాయకులు శ్రీకాంత్ రెడ్డి, నాగలూరు బాబు, కృష్ణారెడ్డి, శ్యాం నాయక్, మునిమడుగు శ్రీనివాసులు, రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










