Sep 02,2023 23:13

ప్రజాశక్తి ఉయ్యూరు : మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 14వ వర్థంతి సందర్భంగా పెనమలూరు నియోజకవర్గంలో పలు చోట్ల ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో శాసనసభ్యులు కొలుసు పార్ధసారది పాల్గొని రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. యనమల కుదురులో వద్దులకు పండ్లను పంపిణి చేశారు. అనంతరం సంజీవయ్య నగర్‌ ఉచిత కంటి పరీక్షల వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పోరంకిలో జరిగిన కార్యక్రమంలో పార్థసారధితోపాటు ఎంపి వల్లభనేని బాలసౌరి, పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్‌ కుమార్‌ పాల్గొని, వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.