Sep 08,2023 19:34

కుంభోత్సవంలో పాల్గొన్న ప్రజలు

ప్రజాశక్తి - హోళగుంద
హోళగుండలో వెలసిన ఉలిగమ్మ అవ్వ కుంభోత్సవం రజకుల ఆధ్వర్యంలో వైభవంగా సాగింది. శ్రావణమాసం నాలుగో శుక్రవారం సందర్భంగా ఈ కుంభోత్సవాన్ని నిర్వహించారు. గ్రామంలోని పెద్దబావి వద్ద నుంచి గంగిపూజ చేసి భక్తులు మేళతాళాలు, డప్పు, వాయిధ్యాల మధ్య కుంభాన్ని పురవీధుల గుండా ఊరేగించారు. స్థానిక చాకలి వీధి వద్ద వెలసిన ఉలిగమ్మ అవ్వ ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయంలో స్వామి వారికి ఆకుపూజ, మహామంగళ హారతి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చిన భక్తులకు రజక సంఘం, గ్రామ పెద్దలు అన్నదానం ఏర్పాటు చేశారు.