May 02,2023 22:43

kalyanam

వైభవంగా స్వామివారి కళ్యాణం
ప్రజాశక్తి-కోడూరు
కోడూరు మండల పరిధిలోని లింగారెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత గోకర్ణేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని సోమవారం రాత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా నిర్వహించారు. కొత్తలంక జగన్నాధ శర్మదంపతులు స్వామివారి కల్యాణ కర్తలుగా వ్యవహరించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి కల్యాణ కార్యక్రమాన్నివైభోవోపేతంగా నిర్వహించారు. కళ్యాణాన్ని తిలకించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి సిహెచ్‌ సుధాకరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అద్దంకి వేణుగోపాలరావు,బడే సూర్యనారాయణ,యర్రంశెట్టి దామోదర్‌ రావు చిట్టిప్రోలు సుబ్రహ్మణ్యేశ్వర రావు, దాసరి వెంకటకష్ణారావు, తోపాటు దేవాదాయ శాఖ సిబ్బంది ప్రసాద్‌, దామర్లఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.