వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్‌లో కొత్త వెర్షన్ తెచ్చింది. అదేంటంటే ఇప్పటిదాకా ఏదైనా వీడియోను షేర్ చేసేటపుడు దాని వాయిస్‌ను ఆపే అవకాశం లేదు. ఈ క్రమంలో అభ్యంతరకర మాటలనూ వినాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ పరిస్థితి లేకుండా మ్యూట్ ఆప్షన్‌ను వాట్సాప్ జత చేసింది. దీంతో అనవసరమైన ఆడియోను తీసేసి వీడియోను మాత్రమే పంపుకునే వీలు కల్పించింది.
మరి ఈ ఆప్షన్‌ను ఎలా వినియోగించుకోవచ్చంటే.. వీడియోను షేర్ చేసేటపుడు సౌండ్ సింబల్ కనిపిస్తుంది. దీనిని సులువుగా మ్యూట్ చేసేస్తే రిసీవ్ చేసుకునే వారికి ఎలాంటి ఆడియో లేకుండా వీడియో వచ్చేస్తుంది. ఇప్పటికే బీటా వెర్షన్లో అప్డేట్ కోసం రిజిస్ట్రేషన్ కోసం యూజర్లకు అవకాశమిచ్చింది. వీడియోలు, ఫొటోలు, జిఫ్‌లు షేర్ చేసేటపుడు టెక్ట్స్ మెసేజ్ 'బెలూన్'ను రూపొందించింది. అయితే.. ఈ కొత్త ఫీచర్ ఎప్పటి నుండి అందుబాటులోకి వస్తుందో వాట్సాప్ అధికారికంగా చెప్పలేదు.










