వాట్సాప్ తన కొత్త ప్రైవసీ పాలసీని భారతదేశంలో అమలు చేయడానికి సరికొత్త పంథాలో సన్నద్ధమవుతోంది. కొత్త విధాన మార్పులను చదవడానికి, అంగీకరించడానికి వినియోగదారులకు తగినంత సమయాన్ని అందించడానికి సంస్థ రెడీ అయింది. వినియోగదారుల భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లబోదని వాట్సాప్ ప్రకటన చేసింది. ఈమేరకు తన ప్రచారంలో భాగంగా... ''సమీక్షించడానికి నొక్కండి (ుaజూ ్‌శీ తీవఙఱవష)'' అనే పేరుతో చాట్ లిస్ట్ పైన చిన్న బ్యానర్‌గా కనిపిస్తుంది. ఆ బ్యానర్‌పై టాప్ చేస్తే.. కొత్త పాలసీకి సంబంధించి పూర్తి వివరాలు డిస్ప్లే అవుతాయి. వినియోగదారులు ఈ పాలసీని అర్థం చేసుకుని మే 15 లోపు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది.
పెరిగిన టెలిగ్రామ్, సిగల్ డౌన్లోడ్లు..:
ముందుగా ఫిబ్రవరి 8 నుంచి ఈ పాలసీని అమలు చేయాలని వాట్సాప్ భావించింది. వాట్సాప్ కొత్త ప్రైవసీ విధానంపై ఇండియాలో వివాదం రేగింది. వినియోగదారుల భద్రతను ఈ పాలసీ దెబ్బతీస్తుందనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చాలా తక్కువ సమయంలోనే టెలిగ్రామ్, సిగల్ యాప్ డౌన్లోడ్లు ఊపందుకున్నాయి. వాట్సాప్‌లో కొత్త మార్పులను అంగీకరించడానికి వినియోగదారులను బలవంత పెట్టే ప్రయత్నం చేశారు. దీంతో అనుమానం వ్యక్తం చేసిన యూజర్లు ఇతర యాప్‌ల వైపు మొగ్గుచూపారు.
దీంతో వాట్సాప్ సంస్థ తన పంథాను మార్చుకుంది. వినియోగదారులకు తన విధానాన్ని వివరించాలని ఫిక్స్ అయ్యింది. ఈ క్రమంలో వినియోగదారుల భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లబోదని ఓ ప్రకటన కూడా చేసింది. ఇటీవల తీసుకొచ్చిన కొత్త ప్రైవసీ పాలసీని మూడు నెలల తర్వాతే అమలు చేస్తామని వాట్సాప్ తెలిపింది. తమ కొత్త పాలసీతో వ్యక్తిగత గోప్యతా హక్కులపై ఎలాంటి ప్రభావమూ ఉండబోదని వాట్సాప్ వివరణ ఇచ్చింది.










