ఇంటర్నెట్ డెస్క్ : మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్‌ను ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది ఉపయోగిస్తారు. అందుకే వాట్సాప్ తన వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తీసుకొస్తూనే ఉంటుంది. తాజాగా ఓ కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్‌తో మెసేజ్‌ల్ని 24 గంటల్లోనే డిలీట్ చేసుకోవచ్చు. గతంలో మెసేజ్‌లు వారం రోజల తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యేవి. ఇప్పుడు ఈ సమయం 24 గంటలకే తగ్గించేందుకు ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్/ డెస్క్‌టాప్‌లో వాట్సాప్ టెస్టింగ్ చేస్తున్నట్లు పేర్కొంది. ఇప్పుడు వాట్సాప్.. తన ప్రత్యర్థి టెలిగ్రామ్, సిగల్ వంటి యాప్‌లతో.. పోటీపడుతున్న నేపథ్యంలో ఇటువంటి కొత్త ఫీచర్స్‌ను తీసుకొస్తుంది.










