Oct 17,2023 23:22

వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న నాయకులు

ప్రజాశక్తి-శింగరాయకొండ : జెవివి ఆధ్వర్యంలో చెకుముకి టాలెంట్‌ టెస్టు నిర్వహిస్తున్నట్లు జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు కోటపాటి నారాయణ తెలిపారు. శింగరాయకొండలోని దాచూరి రామిరెడ్డి అనసూయమ్మ, ప్రజా సంఘాల భవనంలో జనవిజ్ఞాన వేదిక జిల్లా గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ బి.హరిబాబు చెకుముకి సైన్స్‌ సంబరాలకు సంబంధించి వాల్‌పోస్టర్‌ను మంగళవారం ఆవిష్కరించినట్లు తెలిపారు. పాఠశాల స్థాయిలో నవంబరు 10న, మండల స్థాయిలో నవంబరు 30న, జిల్లా స్థాయిలో డిసెంబర్‌ 17న రాష్ట్ర స్థాయిలో 2024 జనవరి 27,28 తేదీలలో టాలెంట్‌ టెస్టు నిర్వహించ నున్నట్లు ఆయన తెలిపారు. అన్ని పాఠశాలలోని 8, 9, 10 తరగతుల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెవివి అధ్యక్షుడు సునీల్‌ కుమార్‌రెడ్డి, ఎం.నరసింహారావు, సిఐటియు నాయకులు టంగుటూరి రాము, గుంటెనపల్లి శ్రీనివాసులు, టి.రామ్మూర్తి, అక్కయ్య తదితరులు పాల్గొన్నారు.