Sep 21,2023 20:43

దర్యాప్తు చేపడుతున్న పోలీసులు

ప్రజాశక్తి - ఆదోని
మండలంలోని మండిగిరి వాలంటీర్‌గా పని చేస్తున్న హరి బాబు (25) దారుణ హత్యకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న డీఎస్పీ శివ నారాయణ స్వామి, సిఐ విక్రమ్‌ సింహ సంఘటన స్థలానికి వెళ్లి హత్యకు దారి తీసిన కారణాలను దర్యాప్తు చేపట్టారు. మృతుడు వాలంటీర్‌ హరి తలకు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో కొట్టి హతమార్చినట్లు తెలుస్తోందని, హత్యపై ఆరా తీసేందుకు ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని డీఎస్పీ శివ నారాయణ స్వామి వివరించారు. హత్యకు గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. అర్ధరాత్రి ఇంటి దగ్గర బాత్‌రూమ్‌కు అని వెళ్లాడని, ఎంతసేపటికీ రాకపోవడంతో వెళ్లి చూస్తే దారుణ హత్య గురయ్యాడని బంధువులు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. మృతుని తల్లి రోధిస్తున్న తీరు అందరినీ కన్నీరు తెప్పించింది. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందాడని ఆమె విలపించారు.