Aug 30,2023 21:07

విరాళం అందజేస్తున్న నాయకులు

ప్రజాశక్తి - మంత్రాలయం
వాల్మీకులు ఐకమత్యంతో రాజకీయంగా ఎదగాలని మంత్రాలయం మాజీ ఎంపిపి, కెడిసిసి బ్యాంకు ఛైర్మన్‌ కీర్తిశేషులు ఎన్‌.రామిరెడ్డి కుమారులు, వైసిపి నాయకులు రాఘవేంద్ర రెడ్డి, రఘునాథ్‌ రెడ్డి, రామకృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని వారి స్వగ్రామమైన మాధవరంలోని నివాసంలో మంత్రాలయంలో వాల్మీకి మహర్షి విగ్రహం ఏర్పాటుకు రూ.1.50 లక్షల నగదును వాల్మీకి నాయకులకు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నియోజకవర్గంలో వాల్మీకులందరూ ఐకమత్యంతో రాజకీయంగా ఎదగాలని కోరారు. వాల్మీకుల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని హామీఇచ్చారు. విరాళం ఇచ్చిన ముగ్గురు సోదరులకు శాలువాలు, పూలమాలలు వేసి సన్మానించారు. వైస్‌ ఎంపిపి పులికుక్క రాఘవేంద్ర, ఎంపిటిసి నక్కి వెంకటేష్‌, డిసి.తిమ్మప్ప, కాశీం, మిడిగలదిన్నె రామాంజి, మేకల నరసింహులు, వాల్మీకి నాయకులు ఉన్నారు.