ప్రజాశక్తి - మంత్రాలయం
వాల్మీకులను మోసం చేసిన గజదొంగ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. మంగళవారం చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా టిడిపి ఇన్‌ఛార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి ఆధ్వర్యంలో రాఘవేంద్ర సర్కిల్‌లో నియోజకవర్గ వాల్మీకి నాయకులు సామూహిక రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ముందుగా టిడిపి వ్యవస్థాపకులు కీర్తిశేషులు ఎన్‌టి.రామారావు, వాల్మీకి మహర్షి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. రాఘవేంద్ర సర్కిల్ నుంచి వాల్మీకి మహర్షి విగ్రహం వరకు, శ్రీమఠం ముఖద్వారం వద్ద ఉన్న శ్రీరాముని విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి, చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వాల్మీకులకు పెద్ద పీట వేస్తామని గత ఎన్నికల్లో చెప్పి రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి లేకుండా చేశారని విమర్శించారు. చంద్రబాబు అరెస్టు దేశంలోనే కలవరం కలిగిస్తోందని, ఇదంతా రాజకీయ కక్షగా ప్రజలు చూస్తున్నారని తెలిపారు. జగన్ ఒత్తిడికి సిబిఐ తలొగ్గి చంద్రబాబును ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అరెస్టు తర్వాత టిడిపికి ఆదరణ పెరిగిందని, రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా తిక్కారెడ్డి కావడాన్ని ఎవరూ ఆపలేరని తెలిపారు. అనంతరం టిడిపి ఇన్‌ఛార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి మాట్లాడారు. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబును అరెస్టు చేయడం సిగ్గు చేటని, జగన్ ఎన్ని కుట్రలు చేసినా కడిగిన ఆణిముత్యంలా ఆయన బయటికొస్తారని తెలిపారు. దీక్షలో వాల్మీకి నాయకులు పెద్దకడబూరు మండల కన్వీనర్ బసలదొడ్డి ఈరన్న, కోసిగి మండల కన్వీనర్ జ్ఞానేష్, బీసీ సీనియర్ నాయకులు వక్రాని వెంకటేష్, నాడిగేని అయ్యన్న, నాడిగేని రంగన్న, చావిడి వెంకటేష్, బీసీ నియోజకవర్గ అధ్యక్షులు మాధవరం అమర్‌నాథ్ రెడ్డి, పంపాపతి, కురుగోడు, నాడిగేని వీరారెడ్డి, చిన్నబొంపల్లి మాజీ సర్పంచి నరసింహులు, పెద్దబొంపల్లి జనార్ధన్, ఆంజనేయ, కొలిమి వెంకటేష్, ఆర్లబండ రామాంజనేయులు, చిలకలడోన హనుమంతు, నక్కి వెంకటేశ్వర్లు, లక్ష్మారి నరసింహులు, రామయ్య, ఆర్‌టిఎస్ కన్వీనర్ దశరథ రాముడు, కాత్రికి మాజీ సర్పంచి చంద్ర, కామవరం మాజీ సర్పంచి రంగస్వామి, మబ్బు ఆంజనేయ, తలారి ఆంజనేయ, వగరూరు పవన్ కుమార్ రెడ్డి, గోపాల్, కేశన్న, ఎరిగేరి బసవరాజు, కౌతాళం భీమయ్య, హనుమాపురం ఈరన్న, ముచ్చిగేరి ఈరన్న, బెళగల్ గుండేష్, ఉరుకుందప్ప, బసవరాజు, గోపాల్, హుస్సేని, శాతనూరు వెంకటేష్, వారం గోపాల్ కూర్చున్నారు. వీరికి మద్దతుగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్‌రెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు సుధీర్ రెడ్డి, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చిన్న బసప్ప, తెలుగు రైతు జిల్లా కార్యదర్శి ఎల్లారెడ్డి, అశోక్ రెడ్డి, చిన్నతుంబలం వీరేష్ గౌడ్, ఎస్సీ సెల్ సీనియర్ నాయకులు మారెప్ప, యోబు, మైనార్టీ నాయకులు టిప్పు సుల్తాన్, వగరూరు అబ్దుల్, కోసిగి హుస్సేన్ సాబ్, ఉలిగయ్య, రాగన్న, భాస్కర్ రెడ్డి, పవన్ కుమార్, మేకల నరసింహులు, శివ, రామకృష్ణ పాల్గొన్నారు. ఆదోనిలోని ఎన్‌టిఆర్ విగ్రహం ముందు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఎస్టీలు హనుమాన్ నగర్ మాజీ కౌన్సిలర్ నరసింహులు, మహదేవ, ఉరుకుందు, కేశప్ప, సూరి, సూరి, మహాదేవ, మస్తాన్, రవి, గోవిందప్ప కూర్చుని సంఘీభావం తెలిపారు. టిడిపి ఇన్‌ఛార్జీ మీనాక్షి నాయుడు మాట్లాడారు. రాష్ట్రంలో ఆరాచక పాలన సాగుతోందని విమర్శించారు. టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు, నాయకులు రంగస్వామి నాయుడు, సాకరే మారుతి రావు, రామస్వామి, బుద్ధారెడ్డి, బ్రహ్మ, లక్ష్మీనారాయణ, మాబాష, అంజనప్ప, రంగన్న, కృష్ణారెడ్డి, విరుపాక్షి, వీరేష్, పెద్దతుంబలం నాగరాజ్, షరీఫ్, మారుతి నాయుడు, సిద్ధార్థ నాయుడు, ఉరుకుందు, గోవిందప్ప, తెలుగు రైతు జిల్లా నాయకులు సాయిబాబు, మాబాష, శివప్ప, కృష్ణారెడ్డి, ఆది శేషి రెడ్డి, బసవ ఉన్నారు. అలాగే టిడిపి మాజీ ఇన్‌ఛార్జీ గుడిసె కృష్ణమ్మ ఆధ్వర్యంలో ఖాజీపురా ప్రాంతంలో ఇంటింటికీ వెళ్లి సంతకాల సేకరణ చేపడుతూ పోస్టు కార్డు ఉద్యమం ఉధృతం చేశారు. టిడిపి బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిసె శ్రీరాములు, వడ్డేమాన్ గోపాల్, సాధిక్ వలీ, మండగిరి బాబురావు, బెస్త నరసింహులు, ఖాదర్ బాష, వెంకటేష్, రాము, గిరిధర్, భారత్, వీరేష్, టిడిపి ముస్లిం, మైనార్టీ కార్యకర్తలు తాహెర్, అయాన్, మన్సూర్, నూర్ బాష, కలందర్, అక్రం పాల్గొన్నారు. ఎమ్మిగనూరు పట్టణంలోని 3వ వార్డులో 'బాబుతో నేను' నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ.జయ నాగేశ్వర్ రెడ్డి వార్డులోని ప్రతి ఇంటికీ వెళ్లి చంద్రబాబు అక్రమ అరెస్టు తీరును వివరించారు. 'భవిష్యత్తుకు గ్యారెంటీ' గురించి వివరించారు. బాబు అరెస్టును నిరసిస్తూ బీవీ నాయకత్వంలో చేపట్టిన దీక్షలు 21వ రోజుకు చేరాయి. నాయకులు తురేగల్ నజీర్ అహ్మద్, సుందర్ రాజు, రంగస్వామి గౌడ్, రాందాస్ గౌడ్, కటారి రాజేంద్ర, మిఠాయి నరసింహులు పాల్గొన్నారు.










