ప్రజాశక్తి ధర్మవరం టౌన్ : వాల్మీకులను (బోయ) ఎస్టీలుగా గుర్తించాలని వాల్మీకి జాయింట్ యాక్షన్ కమిటి రాష్ట్ర అధికార ప్రతినిధి తలారి చంద్రమోహన్ బాబు డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రమోహన్‌బాబుతో పాటు రాష్ట్ర కమిటి ప్రధానకార్యదర్శి అక్కులప్ప మాట్లాడారు. పార్లమెంట్‌కు పంపిన రాష్ట్ర ప్రభుత్వ తీర్మానానికి సవరణలు చేసి రాష్ట్ర మంతటా వాల్మీకి కులస్తులను ఎస్టీలుగా గుర్తించాలన్నారు. అందుకు పార్టీలకు అతీతంగా వాల్మీకి కులానికి చెందిన ప్రస్తుత, మాజీ ఎంపీలు ఎస్టీ స్టేటస్ తీర్మానాన్ని పాలో అప్ చేయాలని కోరారు. వాల్మీకులను ఓటుబ్యాంక్ దృష్టితో చూడకుండా కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు సంక్షేమపథకాలను అందరికి అందేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో వాల్మీకి జెఎసి నాయకులు హరిప్రసాద్, వెంకటనారాయణ, నరేశ్, జూటూరు నాగరాజు, రాజేశ్, ఆనంద్, కేశన్న, రవి, కేశవ తదితరులు పాల్గొన్నారు.










