Apr 30,2023 22:21

మాట్లాడుతున్న పల్లె రఘునాథరెడ్డి

ప్రజాశక్తి - కొత్తచెరువు : తెలుగుదేశం పార్టీతోనే వాల్మీకుల అభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి అన్నారు. కొత్తచెరువు లోని రైల్వే స్టేషన్‌ సమీపంలో జిల్లా వాల్మీకి సాధికారిక సమితి ఉపాధ్యక్షులు బండ్లపల్లి రాజు ఆధ్వర్యంలోనే వాల్మీకులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా వాల్మీకి సాధికారిక కమిటీ కన్వీనర్‌ బ్రాహ్మణపల్లి రామాంజనేయులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ టిడిపి బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిందన్నారు. ఎంతోమంది ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులను పొందారన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కులానికి రాజకీయ ప్రాధాన్యత కల్పించిందన్నారు. ముఖ్యంగా వాల్మీకులకు బీసీ కులాల్లోనే మొదటి ప్రాధాన్యత కల్పించిందని అన్నారు. పదవి ఉన్నా లేకున్నా నియోజకవర్గంలో పర్యటించి ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి సబ్సిడీ పథకాల పేరుతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని అన్నారు. అనంతరం మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి ఆధ్వర్యంలో వైసిపి పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో పలువురు చేరారు. వేటూరి నారాయణస్వామి, ఇరగలపల్లి బేల్దారి శ్రీరాములు, చిన్న రాయుడు, రామకృష్ణ, లక్ష్మీ దేవమ్మ, లలితమ్మ, నారాయణమ్మ, అంజనమ్మ, గణేష్‌, వెంకట రాముడు తదితరులకు టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కప్పల బండ సర్పంచి పెద్దన్న, వెంకట గారి పల్లి సర్పంచి లక్ష్మీదేవి ఓబులేసు, మాజీ సర్పంచి వెంకటనారాయణ, కిష్టప్ప, బీసీ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు చింతకాయల సుబ్బరాయుడు, వెంకటనారాయణ, గాజుల చంద్రమోహన్‌, ఈరన్న తదితరులు పాల్గొన్నారు