ప్రజాశక్తి - పోలవరం
ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు ఆదేశాల మేరకు టిబిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలవరం గ్రామపంచాయతీ సచివాలయం-2 పరిధిలో కమ్మరగుడెంలో యువతకు వైసిపి యువ నాయకుడు పొడుం శ్యామ్‌కుమార్ సోమవారం వాలీబాల్ కిట్లు అందించారు. ఈ కార్యక్రమంలో ఈదేపల్లి వెంకటగణేష్, పోలవరం సచివాలయ కన్వీనర్ మాదేపల్లి సాయి రామకృష్ణ పాల్గొన్నారు.










