ప్రజాశక్తి - ఆదోని
వాహన సవరణ బిల్లును రద్దు చేయాలని యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ కోరారు. శనివారం ఆదోని సుందరయ్య భవన్‌లో అధ్యక్షులు హనుమంతు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 16, 17న కర్నూలులో జరిగే ఆల్ ఇండియా రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర వర్క్ షాపును జయప్రదం చేయాలని కోరారు. అనంతరం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి.ఈరన్న, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు బి.తిప్పన్న, పిఎస్.గోపాల్, మండల కార్యదర్శి బి.వీరారెడ్డి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా రంగంలో పని చేస్తున్న డ్రైవర్లు, క్లీనర్లకు ఎలాంటి సౌకర్యాలూ కల్పించడం లేదని విమర్శించారు. రవాణా రంగంలో పని చేస్తున్న కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పింఛను సౌకర్యం కల్పించాలని కోరారు. సెప్టెంబర్ 16, 17న కర్నూలు నగరంలో రాష్ట్ర వర్క్ షాపు నిర్వహించి రవాణా రంగంలో పనిచేస్తున్న ఆటో, లారీ, స్కూల్ బస్సులు, లైట్ వెహికల్స్ డ్రైవర్లు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆటో యూనియన్ పట్టణ కార్యదర్శి జి.మనోహర్, నాయకులు గోవిందు, ఈరన్న, లోకేష్, రాము, గోపాల్, యూసుఫ్ ఉన్నారు.
మాట్లాడుతున్న నాయకులు










