హిందూపురం : రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించినప్పుడే పర్యా వరణ పరిరక్షణ సాధ్యం అవుతుందని డిఎస్పి కంజాక్షన్ తెలిపారు. శనివారం నాడు రవాణ శాఖ ఆధ్వర్యంలో వాహన కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణపై రవాణ, పోలీస్ శాఖలు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా డీఎస్పీ కంజాక్షన్, మొటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రమణలు మాట్లాడుతూ ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగంపై నియంత్రణ, జౌళి సంచుల వాడకం, విద్యుత్ ఆదా, సోలార్ వస్తువుల వినియోగం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, కాలుష్య ఉద్గారాల నియంత్రణ, తక్కువ దూరాలకు సైక్లింగ్, ఎలివేటర్ బదులుగా మెట్లను వాడటం వంటి చర్యలతో పర్యావరణ పరిరక్షణకు బాటలు వేయొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మొటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు శివశంకర్, జయశ్రీ యాదవ్, సిఐలు ఈరన్న, రవాణశాఖ, పోలీస్ సిబ్బంది, డ్రైవింగ్ పాఠశాల సిబ్బంది, లారీ డ్రైవర్లు పాల్గొన్నారు.










